సైబర్ నేరగాళ్ల కోసం పోలీసులు భారీ ఆపరేషన్..! 4 h ago

featured-image

TG : సైబర్ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లు, చెక్‌బుక్‌లు, సిమ్‌కార్డుల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ డీసీపీ కవిత 5 ప్రత్యేక బృందాలతో 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరు వివిధ నేరాల్లో మొత్తం రూ.5.29 కోట్లు కాజేశారన్నారు. నిందితులు దేశవ్యాప్తంగా ట్రేడింగ్, ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డారని వివరించారు. ఈ ముఠాలో ఓ మహిళ కీలకంగా వ్యవహరించినట్లు డీసీపీ కవిత పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD